మా టీమ్ కృషి వల్లే ఇది సాధ్యమైంది.. కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన కయ్యదు లోహర్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ కయ్యదు లోహర్(Kayadu Lohar) ‘డ్రాగన్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

మా టీమ్ కృషి వల్లే ఇది సాధ్యమైంది.. కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన  కయ్యదు లోహర్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కయ్యదు లోహర్(Kayadu Lohar) ‘డ్రాగన్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అమ్మడు రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం కయ్యదు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. త్వరలో ఓ మలయాళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మలయాళ హీరో టోవినో థామస్(Tovino Thomas) హీరోగా చేస్తున్న ‘పల్లి చట్టంబి’(Pallichattambi )లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుండగా.. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నౌఫాల్, బ్రజేష్ నిర్మిస్తున్నారు. 1957-58 కాలంలో కేరళలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వలస రైతుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది.

ఇందులో విజయ రాఘవన్, సుధీర్ కరమన, జానీ ఆంటోని, టిజి రవి, ప్రశాంత్ అలెగ్జాండర్, జయకృష్ణన్, వినోద్ కేతమంగళం కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జెక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఇస్తూ కయ్యదు లోహర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన 50 రోజుల షూటింగ్ పూర్తి అయిందని అదంతా తన టీమ్ కృషి, కష్టం వల్లే సాధ్యమైందని తెలిపింది. అలాగే టీమ్‌తో పాటు కలిసి ఫొటో దిగిన వీడియోను షేర్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆనందపడుతూ ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story