ఇది నిజంగా కఠినమైన, భయానకమైన అనుభవం.. తన ఆరోగ్య పరిస్థితిపై కరిష్మా ఎమోషనల్ పోస్ట్..

by Mallepaka Hamsa |

బాలీవుడ్ నటి కరిష్మా శర్మ (Karishma Sharma)ఇటీవల కదులుతున్న రైల్లోంచి దూకేసిన విషయం తెలిసిందే.

ఇది నిజంగా కఠినమైన, భయానకమైన అనుభవం.. తన ఆరోగ్య పరిస్థితిపై కరిష్మా ఎమోషనల్ పోస్ట్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కరిష్మా శర్మ (Karishma Sharma)ఇటీవల కదులుతున్న రైల్లోంచి దూకేసిన విషయం తెలిసిందే. ఈనెల 10న లోకల్ ట్రైన్‌లో ప్రయాణించేందుకు తన స్నేహితురాళ్లతో రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఆమె ఫ్రెండ్ రైలు ఎక్కకపోవడంతో కదులుతున్న ట్రైన్ నుంచి అమాంతం కిందకు దూకేసింది. దీంతో కరిష్మా తల, విపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఆమె కింద పడిన వెంటనే కొకిలబాన్ ధీరూబాయ్ అంబాని హస్పిటల్‌లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, కరిష్మా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నేను ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

అదృష్టవశాత్తు గాయం అంత లోతుగా లేదని డాక్టర్లు చెప్పారు. కానీ నేను కోలుకోవడానికి కొంత కాలం పడుతుందని.. నొప్పి కూడా వస్తుందని అన్నారు. ఇది నిజంగా కఠినమైన, భయానకమైన అనుభవం. కానీ మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, మద్దతు నాకు లభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే అవే నాకు దీన్ని అధిగమించడానికి బలాన్నిచ్చింది. అలాగే నేను విమానంలో ప్రయాణించే నాకు చాలా బలాన్ని ఇచ్చిన మా అమ్మను మర్చిపోకూడదు. నా కోసం ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు నిజంగా నాకు ప్రపంచం. రెండో చాన్స్ అనుకుంటున్నా’’ అని రాసుకొచ్చింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Next Story