సీక్రెట్‌గా తాప్సీ పెళ్లి..! ఈ రొమాన్స్ ఎప్పటికీ ముగిసిపోకూడదంటూ హీరోయిన్ పోస్ట్ వైరల్

by Disha Web Desk 7 |
సీక్రెట్‌గా తాప్సీ పెళ్లి..! ఈ రొమాన్స్ ఎప్పటికీ ముగిసిపోకూడదంటూ హీరోయిన్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రభాస్ ‘Mr ఫర్‌ఫెక్ట్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. కొద్ది కాలానికి బాలీవుడ్ చెక్కేసిన ఈ బ్యూటీ.. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే గతేడాది ‘డంకీ’ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాప్సీ ఎప్పటి నుంచో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా నెట్టింట హల్‌ఛల్ చేశాయి. ఈ క్రమంలోనే తాప్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన ‘తప్పడ్’ సినిమా నటుడు పవైల్ గులాటి.. కొంతమంది మెట్లపై ఉన్న ఫొటో షేర్ చేస్తూ ‘మేము ఎక్కడ ఉన్నామో చెప్పుకోండి’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో తాప్సీ-మథియాస్ పెళ్లిలో ఉండి ఉంటారు అని నెట్టింట కామెంట్లు కూడా వచ్చాయి. దీంతో చాలా మంది తాప్సీ-మథియాస్‌కు పెళ్లి అయిపోయిందంటూ ఫిక్స్ అయిపోయారు.

అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ, తాజాగా తాప్సీ పెట్టిన పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ ధరించి దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేస్తూ.. ‘చీరతో ఈ రొమాన్స్ ఎప్పటికీ ముగిసిపోదని ఆశిస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ కావడంతో.. ‘నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్‌తో నీ బంధం ఎప్పటికీ ముగిసిపోకూడదు అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్తున్నావా’ అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

Read More..

సమంతతో విడిపోయినా.. నాగచైతన్య ఇంట్లో పదిలంగా ఉన్న సమంత గుర్తులు!



Next Story