‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకం: మహేష్ బాబు

by Mallepaka Hamsa |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka)తో అలరించేందుకు సిద్ధమయ్యారు.

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకం: మహేష్ బాబు
X

దిశ, సినిమా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka)తో అలరించేందుకు సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర సూపర్‌స్టార్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘ఈ టైటిల్ కి చాలా మీనింగ్ ఉంది. అది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది.

ఈ సినిమా 2002 టైంలో జరిగింది. అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి అలా పెట్టడం జరిగింది. ఉపేంద్ర చెప్పిన ఒక మాట నాకు చాలా కనెక్ట్ అయింది. సూర్య పాత్ర కోసం మేము ఆయన్నే సంప్రదించాము. ఉపేంద్ర గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సూర్య పాత్రలో స్టార్స్ అందరూ కనిపిస్తారు. రామ్ గారు చాలా వెర్సటైల్ యాక్టర్. ఆయన క్యారెక్టర్‌లో పెర్ఫార్మెన్స్‌లో చాలా ఎనర్జీ ఉంటుంది. నేను రాసుకున్న పాత్రకి గొప్ప ఎనర్జీ కావాలి. ఒక ఫ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడో ఎంత మాస్‌గా ఉంటాడో అలాంటి పెర్ఫార్మర్ కావాలి కాబట్టి ఆయన్ని తీసుకున్నాం ఇలాంటి క్యారెక్టర్‌కి రామ్ గారు పర్ఫెక్ట్. భాగ్యశ్రీ గారి పాత్ర ఈ కథలో చాలా కీలకం. ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

Next Story