- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ప్రయాణం చాలా స్పెషల్.. జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనంటూ వైష్ణవి చైతన్య ఎమోషనల్ పోస్ట్
క్రేజీ బ్యూటీ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తోంది.

దిశ, సినిమా: క్రేజీ బ్యూటీ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె మరోసారి ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)సరసన హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ‘90s బయోపిక్’ వెబ్ సిరీస్‌తో యువత హృదయాలను దోచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు వైష్ణవి చైతన్య సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది.సెట్‌లో చివరి రోజు.. కానీ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం నిలిచిపోయేలా ఉన్నాయి.
ఈ ప్రయాణం నాకు కేవలం ఒక సినిమా షూటింగ్‌గా కాకుండా, ఒక అందమైన జీవిత అనుభవంగా మారిపోయిందని ఎమోషనల్ అయింది. అలాగే ప్రతి రోజు కొత్త ఉత్సాహం, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం, హృదయాన్ని తాకే క్షణాలతో నిండిపోయింది. కెమెరా ఆన్ అయ్యే ముందు నుంచే, కట్ అన్న తర్వాత కూడా ప్రతి క్షణం ఆనందం, నవ్వులు, ఆప్యాయతతో నిండిపోయిందని చెప్పింది. ఈ సినిమా సెట్‌లో గడిపిన సమయం తనకు ఎంతో ప్రత్యేకమంటూ పేర్కొంది. ఇక్కడ కలిసిన ప్రతి వ్యక్తి నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మారిపోయారు. సహనటులు, దర్శకుడు, సాంకేతిక బృందం, ప్రతి ఒక్కరూ కలిసి ఒక కుటుంబంలా మారిపోయారు.
ఒకే లక్ష్యంతో, ఒకే కలతో ముందుకు సాగిన ఈ ప్రయాణం నాకు ఎంతో బలాన్ని, సానుకూలతను ఇచ్చిందంటూ తన స్పెషల్ మూమెంట్స్ గురించి వివరించింది. ప్రతి రోజు సెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన ఎనర్జీ అనిపించేది. ఆ ప్రేమ, ఆ గౌరవం, ఆ స్నేహం ఇవన్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత అందమైన అనుభవంలో భాగమయ్యే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే రోజును ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే ఈ ప్రయాణ ఫలితం మీ ముందుకు రానుంది. అప్పటివరకు ఈ జ్ఞాపకాలను హృదయంలో దాచుకుని, కృతజ్ఞతతో ముందుకు సాగుతున్నానని రాసుకొచ్చింది. అంతేకాకుండా మూవీ టీమ్‌తో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది.






