- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్నీ లియోన్ పెంపకం అంటే ఇది.. పదేళ్లకే లక్షలు సంపాదిస్తున్న కూతురు నిషా
కేవలం పదేళ్ల వయసులోనే ఒక నూతన వస్తువును కనిపెట్టి, దానికి 'పేటెంట్' హక్కులు పొందడమే కాకుండా.. ఒక పారిశ్రామికవేత్తగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సన్నీ లియోన్(Sunny Leone) కుమార్తె నిషా కౌర్ వెబర్(Nisha Kaur Weber) అరుదైన ఘనత సాధించింది. కేవలం పదేళ్ల వయసులోనే ఒక నూతన వస్తువును కనిపెట్టి, దానికి 'పేటెంట్' హక్కులు పొందడమే కాకుండా.. ఒక పారిశ్రామికవేత్తగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పదేళ్ల పిల్లలు ఆటపాటల్లో మునిగిపోతారు, కానీ నిషా మాత్రం తన ఆలోచనతో ఒక సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టింది. నిషా కనిపెట్టిన 'బూ బాక్స్' (Boo Box) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ ‘బూ బాక్స్’ ఐడియా ఎలా వచ్చిందో సన్నీ లియోన్ రీసెంట్‌గా డైరెక్టర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో సరదాగా చెప్పుకొచ్చారు. ముంబైలో ఉండే విపరీతమైన దుమ్ము వల్ల నిషాకు తరచూ అలర్జీ వచ్చి ముక్కు కారుతూ ఉండేది. దీంతో నిషా ఎప్పుడూ టిష్యూలు వాడుతూ, ఆ వాడేసిన టిష్యూలను ఎక్కడపడితే అక్కడ పడేసేది. ఇది చూసి నేను ప్రతిరోజూ నిషాను తిట్టేదాన్ని. ‘‘టిష్యూలు వాడి ఇల్లంతా గందరగోళం చేస్తున్నావు, వెంటనే డస్ట్‌బిన్‌లో పడేయొచ్చు కదా’’ అని తను ఇచ్చే వార్నింగ్స్ నుంచే నిషాకు ఒక అద్భుతమైన ఆలోచన తట్టిందని సన్నీ లియోన్ తెలిపింది.
టిష్యూ బాక్స్ ఒక దగ్గర, డస్ట్‌బిన్ మరో దగ్గర ఉండటం వల్లే కదా ఈ సమస్య వస్తోంది అని ఆలోచించిన నిషా.. ఒక టిష్యూ బాక్స్‌కు పక్కనే వాడేసిన టిష్యూలు పడేయడానికి వీలుగా ఒక చిన్న ‘మినీ డస్ట్‌బిన్’ను అతికించింది. అంటే, మనం టిష్యూ తీసి వాడుకున్న వెంటనే, ఎక్కడికీ వెళ్లకుండానే పక్కనే ఉన్న బిన్‌లో పడేయొచ్చు అన్నమాట. ఈ చిన్న ఐడియా ఇల్లు శుభ్రంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తించిన సన్నీ లియోన్ దంపతులు, దానికి పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ‘బూ బాక్స్’ ఒక కమర్షియల్ ప్రొడక్ట్‌గా మారి మార్కెట్లోకి రావడమే కాకుండా, నిషాకు సొంతంగా సంపాదనను కూడా తెచ్చిపెడుతోంది. పదేళ్లకే తన కాళ్ల మీద తాను నిలబడి డబ్బు సంపాదిస్తున్న కూతురుని చూసి సన్నీ లియోన్ ఎంతో గర్వపడుతున్నారు. 2017లో మహారాష్ట్రలోని లాతూర్ నుండి నిషాను దత్తత తీసుకున్నప్పటి నుండి, ఆమెను సొంత బిడ్డ కంటే మిన్నగా చూసుకుంటున్న సన్నీ లియోన్ పెంపకాన్ని నెటిజన్లు ఇప్పుడు తెగ మెచ్చుకుంటున్నారు.






