- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది చాలా దురదృష్టకరం.. పురుష నటులకు ఉండే విధంగా మాకుండదు: రసికా దుగ్గల్
బాలీవుడ్ హీరోయిన్ రసికా దుగ్గల్ (Rasika Duggal)విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ రసికా దుగ్గల్ (Rasika Duggal)విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ‘లార్డ్ కర్జన్ కి హవేలి’(Lord Curzon's Haveli) అనే బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌తో వచ్చింది. ఇక ఇందులో కామెడీ పాత్రలో నటించి తన పాపులారిటీ పెంచుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రసికా.. ఇండస్ట్రీలో పురుష నటులకు లభించినన్ని అవకాశాలు స్త్రీలకు ఉండవని పలు వ్యాఖ్యలు చేసింది ‘‘ఈ బ్లాక్ కామెడీ నాకు మొదటి అడుగు అని నేను ఆశిస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరం, ఎందుకంటే పురుష నటులకు లభించినంతగా హాస్య పాత్రలలో నటించే అవకాశం మహిళా నటులకు లభించవని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే మహిళలకు హాస్యం చేసే సత్తా ఉంటుంది. లేకుంటే ఈ పితృస్వామ్మ ప్రపంచంలో మనం ఎలా మనుగడ సాధించగలం? అలా చేయాలంటే మరిన్ని అవకాశాలు ఇవ్వాలి కానీ ఇండస్ట్రీలో అలా జరగదు. నటులు తమ నటనతో పాటు ఒత్తిళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. అది నాకు ఫన్నీగా అనిపిస్తుంది. మనం రియాలిటీ టెలివిజన్ షోలో గడుపుతున్నట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ దాని గురించి భయపడుతున్నారు. ఏదో ఒక విధంగా సర్ధుబాడు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది. మహిళా నటులకు దర్శక నిర్మాతలు హాస్య పాత్రల్లో నటించే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.






