సామాన్యుడు విప్లవ వీరుడిగా పోరాడే కథ ఇది.. చరిత్రలో నిలిచిపోతుంది

by Mallepaka Hamsa |

భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’(viplava veerudu).

సామాన్యుడు విప్లవ వీరుడిగా పోరాడే కథ ఇది.. చరిత్రలో నిలిచిపోతుంది
X

దిశ, సినిమా: భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’(viplava veerudu). ప్రముఖ నటి ఇంద్రజ (Indraja)కీలక పాత్రలో జైశ్వర్- సోనాలి (Sonali)జంటగా ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించుకుంది. ముహూర్తం షాట్‌కు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై క్లాప్ కొట్టి మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. ఇంద్రజ మాట్లాడుతూ.. “స్వాతంత్ర కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు.

సామాన్య ప్రజలు కూడా స్వాతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఒక సామాన్యుడు విప్లవ వీరుడిగా మారి స్వతంత్ర ఉద్యమంలో విరోచితంగా పోరాడే కథ ఇది. ఈ చిత్రంలో నేను రాణి భవానిదేవి పాత్రలో కనిపించబోతున్నాను. బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నామన్నదే కథాంశం. అర్థవంతమైన కథతో నిర్మాత జయరాం మంచి సినిమా నిర్మిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అని అన్నారు. హీరో జైశ్వర్ మాట్లాడుతూ.. విప్లవ వీరుడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. సినిమా చరిత్రలో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత ఏవీ జయరాం మాట్లాడుతూ.. “టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇది. బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో దేశాన్ని ఎలా దోచుకున్నారో, ఆ పరిణామాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. మంచి సందేశం ఇచ్చే సినిమా అవుతుంది” అని చెప్పారు.

Next Story