- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rishabh Shetty: ఇది ఒక తిరుగుబాటుదారుడి కథ.. రిషబ్ శెట్టి కొత్త సినిమా నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’ సినిమాతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’ సినిమాతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ చేస్తున్నారు. ‘కాంతార: చాప్టర్ 1’ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ రిషబ్ శెట్టి స్వయం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. పలు అడ్డంగులు ఎదురవుతున్నాయి. దీంతో కొన్ని రోజులు వాయిదా వేశారు. ఇక ఈ చిత్రంతో పాటు రిషబ్ శెట్టి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ జీవిత కథ ఆధారంగా రాబోతున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ కూడా చేస్తున్నారు.
ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. తెలుగులో ‘జై హనుమాన్’ కూడా చేస్తున్నాడు. ఈ మూడు భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న రిషబ్ శెట్టి వరుస చిత్రాలు అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా, ఆయన ఓ డెబ్యూ మూవీతో రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. అంతేకాకుండా మూవీ మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో రిషబ్ శెట్టి కత్తులను కట్టుకుని.. ముఖానికి ఓ క్లాత్ కట్టుకుని ఉండగా.. కొంతమంది యుద్ధానికి ఉపయోగించే బల్లెంలు పట్టుకుని పరుగెడుతున్నారు.
ఇక ఈ పోస్టర్‌లో ‘భూమి తిరుగబాటుదారుడైన గులాబీని కాల్చివేసింది’ అని రాసి ఉంది. ప్రస్తుతం అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. కాగా.. ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై రాబోతుండగా.. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్నారు. ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు(Ashwin Gangaraju) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ 36 పేరుతో రాబోతుండగా.. తెలుగు, కన్నడలో ఒకేసారి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఓ తిరుగుబాటుదారుడి కథతో తెరకెక్కిస్తున్నారు.






