- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాహుబలి తర్వాత ఈ సినిమానే.. ప్రశంసలు రాలేదంటూ ఆర్జీవీ ట్వీట్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja), కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’(Mirai).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja), కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’(Mirai). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో తేజ సజ్జా సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. ‘మిరాయ్’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో సెప్టెంబర్ 12న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రేక్షకులను మెప్పించడంతో పాటు సినీ ప్రియుల ప్రశంసలు పొందుతోంది. ఈక్రమంలో.. తాజాగా, ‘మిరాయ్’ సినిమాపై వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ ఓ ట్వీట్ పెట్టాడు. ‘‘మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్‌కు కంగ్రాట్స్. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదు. వీఎఫ్‌ఎక్స్‌తో పాటు కథ కూడా రెండూ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆనందపడుతున్నారు.






