Mahesh Babu-Pawan Kalyan కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే?

by Kodari Anjali |   (  Updated:2023-10-27 16:14:20  IST  )

కొందరు స్టార్ హీరోల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కితే చూడాలని ఫ్యాన్స్ భావిస్తారు.

Mahesh Babu-Pawan Kalyan కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్: కొందరు స్టార్ హీరోల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కితే చూడాలని ఫ్యాన్స్ భావిస్తుంటారు. ఇప్పటికే ఊహించని కాంబోలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు సందడి చేశాయి. ఔరా అనిపించాయి. అభిమానులను అలరించాయి. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మహేష్ బాబు కలయికలో ఓ బ్లాక్ బస్టర్ చిత్రం మిస్ అయ్యిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఇందులో పెద్దోడు, చిన్నోడు పాత్రల కోసం ఫస్ట్ దర్శక, నిర్మాతలు పవన్, మహేష్‌లను అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టలేకపోయారట. ‘కానీ వీరిద్దరి కలయికలో సినిమా వస్తే మాత్రం థియేటర్ పేలిపోవాల్సిందే’ అంటూ అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఘట్టమనేని ఫ్యాన్స్ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : నాచురల్ స్టార్ నాని గురించి బయటపడ్డ సంచలన నిజాలు!

Next Story