నాచురల్ స్టార్ నాని గురించి బయటపడ్డ సంచలన నిజాలు!

by Anjali |
నాచురల్ స్టార్ నాని గురించి బయటపడ్డ సంచలన నిజాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఫ్యామిలీపై కూడా అంతే శ్రద్ధ వహిస్తారు. కాగా నేడు నాని-అంజన వివాహ బంధంలో అడుగుపెట్టి 11 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా నాని తన సతీమణి అంజన యేలవర్తికి నుదుటిపై కుంకుమ పెడుతూ విషెష్ తెలిపారు. ఈ బ్యూటీఫుల్ పోస్ట్‌ను నాని సోషల్ మీడియాలో షేర్ చేయగా తన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే నాని-అంజన పెళ్లి రోజు సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ అయ్యింది. అయితే నాని వైజాగ్‌లో ఆర్‌జే గా వర్క్ చేస్తోన్న సమయంలో అంజనను ఫస్ట్ టైమ్ కలిశారట. ఈ కొద్ది సమయం పరిచయం కాస్త మంచి స్నేహంగా మారింది. ఇక ఆ స్నేహం.. ప్రేమగా మారడంతో 5 ఏళ్ల పాటు రిలేషన్‌లో ఉండి, నాని-అంజన వివాహ బంధంతో ఒక్కటయ్యారట.

ఇవి కూడా చదవండి : మహేష్ బాబు-పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే?
Next Story