Nandamuri Taraka Ratna చివరి వీడియో ఇదే..!

by Javid Pasha |   (  Updated:2023-02-20 05:12:06  IST  )

జనవరి 27న గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే

Nandamuri Taraka Ratna చివరి వీడియో ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: జనవరి 27న గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా ఆయన బతికున్నప్పటి చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో తారకరత్న చివరిసారిగా కనిపించారు. ఈ పాదయాత్రలోనే తారకరత్నకు గుండెపోటు రావడంతో ఆయన్ని బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చికిత్స పొందుతూ తారకరత్న ఫిబ్రవరి 18న మృతి చెందారు. కాగా తారకరత్న మృతిపట్ల రాజకీయ, సినీ, ఇతర ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న ఇలా అకాల మరణం చెందడం బాధాకరమని వారు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :

నాలుగు రోజుల్లో బర్త్ డే.. అంతలోనే విషాదం

Tarakaratna: తారక రత్న భార్య అలేఖ్య రెడ్డిని ఎలా పెళ్లి చేసుకున్నాడంటే!

Next Story