- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు రోజుల్లో బర్త్ డే.. అంతలోనే విషాదం
తన బర్త్ డేకు నాలుగు రోజులు ముందు తారకరత్న చనిపోవడం పెద్ద సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.

X
దిశ, వెబ్ డెస్క్: గుండెపోటుతో 23 రోజులు పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18న మృతి చెందారు. కాగా ఫిబ్రవరి 22 ఆయన బర్త్ డే. సరిగ్గా తన బర్త్ డేకు నాలుగు రోజుల ముందే ఆయన చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. జనవరి 27న గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో జాయిన్ అయిన తారకరత్న.. పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తారని, తన బర్త్ డే వేడుకల్లో పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, నందమూరి ఫ్యాన్స్ ను దు:ఖ సాగరంలో ముంచెత్తింది. అటు తాత స్థాపించిన టీడీపీలో చురుగ్గా పాల్గొంటూ.. ఇటు సినిమాల్లోనూ బిజీ అవుతోన్న క్రమంలో తారకరత్న ఇలా అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Nandamuri Taraka Ratna చివరి వీడియో ఇదే..!
Next Story






