- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదే నాకు దక్కిన బెస్ట్ గిఫ్ట్.. నీ వల్లే ధైర్యంగా అనిపించిందంటూ అతడిపై టాలీవుడ్ బ్యూటీ స్పెషల్ పోస్ట్
‘రాజావారు రాణిగారు’(Raja Vaaru Rani Gaaru ) సినిమాతో రహస్య(Rahasya Gorak ) టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: ‘రాజావారు రాణిగారు’(Raja Vaaru Rani Gaaru ) సినిమాతో రహస్య(Rahasya Gorak ) టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడం కొద్దికాలంపాటు ఉద్యోగం చేసింది. కానీ కిరణ్ మాత్రం విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. మొదటి సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)తో రహస్యకు స్నేహం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారగా.. పెద్దలను ఒప్పించి గత ఏడాది ఆగస్టు నెలలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల తండ్రిగా ప్రమోషన్ కూడా పొందాడు. ఏడాదిలోనే పెళ్లి జరగడం.. ఓ కొడుకుకు తండ్రి అయిపోవడం జరిగిపోయింది. ఇదిలా ఉంటే.. నేడు రహస్య-కిరణ్ అబ్బవరం పెళ్లి రోజు కావడంతో స్పెషల్ పోస్ట్ పెట్టింది.
‘‘పెళ్లికి సరిగ్గా గంటముందు నాకు చాలా ఆందోళనగా ఉంది. నా గుండే గట్టిగా కొట్టుకుంటోంది. అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి ఓ నోట్ ఇచ్చావు. దీంతో నాకు ప్రశాంతంగా ధైర్యంగా అనిపించింది. ఏం జరిగినా సరే ఇతడు చూసుకుంటాడులే అనిపించింది. ఇదే నాకు దక్కిన బెస్ట్ గిఫ్ట్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కిరణ్ అబ్బవరం’’ అని రాసుకొచ్చింది. అలాగే భర్తతో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇక కిరణ్ ఇచ్చిన నోట్‌లో ఏముందంటే.. ‘‘నన్ను భర్తగా కోరుకున్నందుకు థాంక్స్. నా జీవితంలోకి స్వాగతం. బాగా చూసుకుంటా’’ అని రాసి ఉంది. ఈపోస్ట్ చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






