దసరా మూవీ కంటే ముందు శ్రీకాంత్ ఓదెల ఏం చేసేవాడో తెలుసా?

by Dishanational2 |
దసరా మూవీ కంటే ముందు శ్రీకాంత్ ఓదెల ఏం చేసేవాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : నేచురల్ స్టార్ హీరోగా నటించి దసరా సినిమా మూవీ పాన్ ఇండియా లెవల్‌లో విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ మూవీ క్లైమాక్స్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గురించి నెట్టింట్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈయన దసరా సినిమా కంటే ముందు ఏం చేసేవాడు, ఈయన ఏ ప్రాంతానికి చెందిన అతను అని గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారంట.

కాగా, శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు ముందు ఏం చేసేవాడో ఇప్పుడు తెలుసుకుందాం.దసరా సినిమాకన్నా ముందు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడండట. కరీంనగర్ జిల్లాలోని సింగరేణి ప్రాంతానికి చెందిన వ్యక్తి శ్రీకాంత్. చిన్నప్పటి నుంచి సినిమా నిర్మాణం, స్క్రీన్ రైటింగ్ పట్ల ఆసక్తి ఉండటంతో సినీ రంగంవైపు అడుగులు వేశాడు. 2016లో టూ పాదర్ విత్ లవ్ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఇక ఆ తరువాత సుకుమార్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా చేరి,రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడంట.

ఇవి కూడా చదవండి: నాని ‘దసరా’.. మహేష్ బాబు రివ్వూ


Next Story