Tamannaah Bhatia: నా 18 ఏళ్ల కెరీర్‌లో చేసిన వాటిల్లో ఇది చాలా ప్రత్యేకం.. తమన్నా ఎమోషనల్ పోస్ట్

by Hamsa |   ( Updated:2024-08-23 14:34:57.0  )
Tamannaah Bhatia: నా 18 ఏళ్ల కెరీర్‌లో చేసిన వాటిల్లో ఇది చాలా ప్రత్యేకం.. తమన్నా ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటుంది. అయితే ఇటీవల తమన్నా శ్రద్దా కపూర్ స్త్రీ-2 మూవీలో స్పెషల్ సాంగ్ చేసి దుమ్మురేపింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. స్పెషల్ సాంగ్ కోసం అమ్మడు బాగానే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ తమన్నా ఓదెల-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తాజాగా, తమన్నా రాధమ్మలా రెడీ అయి ఫొటోలు షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నా 18 ఏళ్ల కెరీర్‌లో నేను పని చేసిన అత్యుత్తమ యాడ్ ఇదే అని సంకోచం లేకుండా చెప్పగలను. నాతో సహా పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఓపికగా ఉండి షూట్ కంప్లీట్ చేశారు. ప్రతి షూట్ ఎల్లప్పుడూ ప్రేమ, సంరక్షణతో నిండి ఉంటుంది. కానీ ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తీవ్రమైన వేడి ఉన్నప్పటికీ, మేము ఖచ్చితమైన నీడ, చినుకులు, వెలుతురుతో ప్రశాంతత క్షణాలను అనుభవించాము. రాధను మూర్తీభవిస్తున్నప్పుడు నాకు అతీతమైన కనెక్షన్ అనిపించిన సందర్భాలు ఉన్నాయి. దాని వెనుక ఒక దైవిక శక్తి ఉన్నట్లు అనిపించింది.

యాడ్ విజువల్స్‌లో ఈ దైవత్వం స్పష్టంగా కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న వ్యక్తి కరన్ తరానికి ధన్యవాదాలు. అతను నిజంగా సృజనాత్మక మేధావి, అత్యంత ప్రతిభావంతులైన యువ డిజైనర్లలో ఒకడు. కారంటోరాణి తన పని ద్వారా అత్యంత ఆకర్షణీయమైన కథలను చెప్పారు. ఈ ప్రచారంలో ప్రేమ, ప్రతి దశను అందంగా చిత్రీకరించారు. సేకరణను ప్రదర్శించడం కంటే కథ చెప్పడంపై అతని ప్రాధాన్యత బ్రాండ్, నిజమైన సారాన్ని హైలైట్ చేస్తుంది. అందరి ప్రేమకు ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా రాదమ్మలా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

(Video Link Credits to tamannaahspeaks Instagram Channel)

Advertisement

Next Story