- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది సీక్వెల్ కాదు.. ఫ్రాంచైజీ మాత్రమే.. ఇందులో కథ, పాత్రలు, భావోద్వేగాలు అన్నీ సరికొత్తగా ఉంటాయి: కృతి సనన్
షూటింగ్ సమయంలో రష్మికతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కృతి సనన్ ఎమోషనల్ అయ్యారు. "రష్మిక చాలా జెన్యూన్ పర్సన్. తనలో ఎక్కడా ‘ఇన్సెక్యూరిటీ’ (అభద్రతాభావం) అన్నది కనిపించదు.

దిశ, సినిమా: బాలీవుడ్ తెరపై త్వరలో ఒక క్రేజీ మల్టీస్టారర్ సందడి చేయబోతోంది. కృతి సనన్, రష్మిక మందన్న, షాహిద్ కపూర్ కలయికలో వస్తున్న ‘కాక్‌టెయిల్ 2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. తాజాగా జరిగిన ‘ఫెమినా బ్యూటీ అవార్డ్స్’ వేడుకలో కృతి సనన్ తన సహనటి రష్మిక గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్మికతో తనకున్న అనుబంధం గురించి కృతి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో రష్మికతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కృతి సనన్ ఎమోషనల్ అయ్యారు. "రష్మిక చాలా జెన్యూన్ పర్సన్. తనలో ఎక్కడా ‘ఇన్సెక్యూరిటీ’ (అభద్రతాభావం) అన్నది కనిపించదు. ఎదుటివారి ఎదుగుదల చూసి అసూయపడే తత్వం ఆమెది కాదు. నేను మనుషుల్లో ఉండే ఆరా పాజిటివిటీని ఎక్కువగా గమనిస్తాను. రష్మిక దగ్గర ఆ వైబ్ నాకు చాలా బాగా నచ్చింది. తను ఒక మంచి మనసున్న అమ్మాయి, అందుకే నాకు రష్మిక అంటే చాలా ఇష్టం" అని కృతి పొగడ్తలతో ముంచెత్తారు.
2012లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘కాక్‌టెయిల్’కు ఇది సీక్వెల్ అని వస్తున్న వార్తలపై కృతి స్పష్టత ఇచ్చారు. "పాత సినిమాతో పోలికలు రావడం సహజం. కానీ ‘కాక్‌టెయిల్ 2’ అనేది ఆ సినిమాకు కొనసాగింపు కాదు. ఇదొక ‘ఫ్రాంచైజీ’ మాత్రమే. ఇందులో కథ, పాత్రలు, భావోద్వేగాలు అన్నీ సరికొత్తగా ఉంటాయి" అని ఆమె పేర్కొన్నారు. హోమీ అడజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నటుడు విజయ్ దేవరకొండను రష్మిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌కు కృతి సనన్ ప్రత్యేకంగా హాజరయ్యారు. సెట్స్‌లోనే కాదు, నిజ జీవితంలో కూడా వీరిద్దరూ మంచి స్నేహితులని ఆ వేడుక ద్వారా నిరూపితమైంది. రష్మిక ఇప్పటికే యానిమల్, సికందర్ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతుండగా, ‘కాక్‌టెయిల్ 2’ ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
నయనతార యాక్టింగ్‌పై కరీనా కపూర్ రియాక్షన్ ఇదే.. ఆసక్తికర కామెంట్స్ వైరల్






