- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైలెంట్‌గా తీసుకోవడానికి ఇదేం పెన్షన్ కాదు.. నేషనల్ అవార్డు ఇవ్వడంపై నటి ఫైర్
ఇటీవల 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఇటీవల 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 2023సంవత్సరానికి గాను జాతీయ అవార్డులు ఎంపిక చేసి జ్యూరీ అనౌన్స్‌మెంట్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అన్ని భాషల నుంచి చిత్రాలను ఎంపిక చేయగా.. మొత్తం 15 విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. ఉళ్లోళుక్కు చిత్రానికి గానూ సీనియర్ నటి ఊర్వశి(Urvashi)కి ఉత్తమ సహాయ నటిగా అవార్డు లభించింది.
తాజాగా.. ఈ విషయంపై నటి ఊర్వశి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తమ నటి అవార్డు ఇవ్వొచ్చుగా అని జ్యూరీ సభ్యులను ప్రశ్నించింది. ‘‘యాక్టింగ్ అంటే ఇలా ఉండాలనేమైనా కొలమానాలు రాసిపెట్టారా? లేదంటే ఫలానా వయసు దాటిందంటే ఉత్తమ సహాయ నటి అవార్డులే ఇవ్వాలని రూల్ పెట్టారు? సైలెంట్‌గా ఇచ్చిందేదో తీసుకునేందుకు ఇదేమీ పెన్షన్ డబ్బు కాదు. మీరు నన్ను సహాయ నటిగా ఏ లెక్కన పరిగణించారో నాకు చెప్పండి.
ఏయే విధానాలు ఫాలో అయ్యారో, ఏయే అంశాలను పరిగణలోకి తీసుకున్నారో వెల్లడించండి. అవార్డుల ప్రకటన ఎప్పుడైనా గర్వంతో పొంగిపోయేలా ఉండాలే కానీ మేము తిరిగి ప్రశ్నించేలా ఉండకూడదు’’ అని ఫైర్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఊర్వశి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అమ్మగా, అత్తగా, అక్క గా నటించి తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది.






