'Khushi' సినిమా రీ రిలీజ్‌పై భూమిక రియాక్షన్ ఇదే

by Disha Web Desk 6 |
Khushi సినిమా రీ రిలీజ్‌పై భూమిక రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించి చిత్రం 'ఖుషి'. దీనికి sj సూర్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2001 ఏప్రిల్ 26 న విడుదలై అప్పట్లో కలెక్షన్లతో రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇటీవల 'ఖుషి' మూవీని డిసెంబర్ 31న థియేటర్స్‌లో మళ్లీ రీ రిలీజ్ చేయనున్నట్టు దర్శకుడు sj సూర్య అధికారికంగా ప్రకటించాడు. అయితే దీనిపై హీరోయిన్ భూమిక స్పందించారు. ''నా 'ఖుషి' సినిమా 31 డిసెంబర్‌ న రీ రిలీజ్ అవుతుంది. నా ప్రొడ్యూసర్ రత్నం గారికి, డైరెక్టర్ sj సూర్య, పవన్ కల్యాణ్ గారికి థ్యాంక్యూ, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అందరూ 'ఖుషి' చిత్రాన్ని చూసి ఏంజాయ్ చేయండి'' అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Next Story

Most Viewed