- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nagababu: చాలా సంతోషకరమైన సందర్భం ఇది.. ఆసక్తికర ట్వీట్ చేసిన నాగబాబు.. ఏ విషయం గురించంటే?
మెగా డాటర్ నిహారిక (niharika) తెరకెక్కించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’(Committee Kurrollu) బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక (niharika) తెరకెక్కించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’(Committee Kurrollu) బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద ఊహించని విధంగా ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే ఈ చిత్రం ప్రతిష్టాత్మక గద్దర్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు నెట్టింట నానా రభస చేస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై నాగబాబు(Nagababu) స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ‘‘గద్దర్ గౌరవాన్ని పెంపొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. ప్రఖ్యాత ప్రజా కవి శ్రీ గద్దర్ గారి పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం "గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్" అందజేయడం ద్వారా గద్దర్ గారి గౌరవాన్ని పెంపొందిస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషకరమైన సందర్భం. నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు రావడం చాలా సంతోషకరంగా అనిపించింది. అంతే కాకుండా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్ర దర్శకుడు యదు వంశీ ఉత్తమ తొలి దర్శకుడి అవార్డును కూడా అందుకోవడం ద్వారా అతనిలో ఉన్న నైపుణ్యానికి ప్రోత్సాహం లభించినట్లయింది.
నేను తొలిసారిగా నిర్మించిన రుద్రవీణ సినిమాకు ‘జాతీయ సమైక్యత పై ఉత్తమ చలనచిత్రంగా నర్గీస్ దత్ అవార్డు’ లభించడం, అదే కోవలో ఇప్పుడు నా కూతురు నిహారిక నిర్మించిన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం సారూప్యమైన యాదృచ్చిక సంఘటన. అవార్డులు అందుకున్న నిర్మాత నిహారిక, దర్శకుడు యదు వంశీ, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా ప్రత్యేక అభినందనలు’’ అని రాసుకొచ్చారు.






