- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాజల్ కెరీర్‌లోనే ఇది విభిన్నమైన పాత్ర.. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు: సుమన్
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సత్యభామ’.

దిశ, సినిమా: కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సత్యభామ’. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న కాజల్ క్యారెక్టర్ గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు దర్శకుడు. ‘కాజల్ కెరీర్‌లోనే విభిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. సత్యభామగా ఆమె కొత్త అవతారాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. దాదాపు షూటింగ్ 60శాతం పూర్తైంది. ఇటీవలే హైదరాబాద్‌లో కాజల్ షూటింగ్‌లో పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలతోపాటు పోరాటాలను కూడా తెరకెక్కించాం. ఈ నెల రెండోవారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పాడు. ఇక బాబీ తిక్క, శ్రీనివాస్ తక్కలపల్లి నిర్మిస్తున్న మూవీ టీజర్ ఈనెల 11న విడుదల చేయనుండగా ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
- Tags
- kajal aggarwal






