- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఆలోచనను ఇప్పటి వరకు వెండితెరపై చూపించలేదు.. రక్షిత్ అట్లూరి ఆసక్తికర కామెంట్స్
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆపరేషన్ రావణ్'. తెలుగు, తమిళ భాషల్లో వెంకట సత్య దర్శకత్వం వహిస్తుండగా.. ధ్యాన్ అట్లూరి నిర్మించారు.

దిశ, సినిమా: రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆపరేషన్ రావణ్'. తెలుగు, తమిళ భాషల్లో వెంకట సత్య దర్శకత్వం వహిస్తుండగా.. ధ్యాన్ అట్లూరి నిర్మించారు. ఈ నెల 26న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ ‘‘న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లలర్‌గా ఈ సినిమాను నేటి తరం ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా రూపొందించాం. నాన్న దర్శకత్వంలో ఈ మూవీలో నటించడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది.
ఈ చిత్రంలో సైకో పాత్ర.. పుట్టకతోనే సైకో కాదు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అలా అవుతాడు. మనిషి ఆలోచనల అంతర్యుద్ధాన్ని ఇప్పటి దాకా ఎవరూ వెండితెరపై చూపించలేదు. మా సినిమాలో అలాంటి ప్రయత్నం చూడొచ్చు. ఈ సన్నివేశాలన్నీ థియేటర్‌లో బాగా అలరిస్తాయనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో నేను ఆనంద్ శ్రీరామ్ అనే టీవీ రిపోర్టర్ పాత్రను చేశాను. ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన నాన్న దర్శకత్వం పట్ల అందరూ హ్యాపీగా ఉన్నారు’’ అని అన్నారు.






