- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది నా గుండెను చాలా తీవ్రంగా బాధపెడుతోంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
కర్నూల్ జిల్లాలో శుక్రవారం నాడు తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: కర్నూల్ జిల్లాలో శుక్రవారం నాడు తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటనతో అంతా వణికిపోతున్నారు. యావత్ దేశాన్ని కలచి వేసిన ఈ ఘటనపై సినీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. పలువురు హీరోలు ట్విట్టర్ ద్వారా స్పదించగా.. తాజాగా, రష్మిక ఎమోషనల్ అయింది. ‘‘కర్నూల్‌లో జరిగిన ఘోర ప్రమాదం నా గుండెను చాలా తీవ్రంగా బాధపెడుతోంది. తగలబడుతున్న బస్సులో కాలిపోయే ముందు ప్రయాణికుల బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇక కుటుంబం మొత్తం నిమిషాల్లోనే తమ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకున్నాక చాలా బాధేసింది.
చిన్న పిల్లలతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఈ సంఘటన వినాశకరమైనది, ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా నివాళి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలను నా సానుభూతి తెలియజేస్తున్నాను. దేవుడు వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’’ అని రాసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 19మంది ప్రాణాలు కోల్పోగా..25మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులున్నట్లు సమాచారం.






