ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటుంది: విక్రాంత్ రుద్ర

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-29 08:10:46  IST  )

జయరామరాజు (Vijayarama Raju)ప్రధాన పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'(Arjun Chakravarthy).

ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటుంది: విక్రాంత్ రుద్ర
X

దిశ, సినిమా: విజయరామరాజు (Vijayarama Raju)ప్రధాన పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'(Arjun Chakravarthy). విక్రాంత్ రుద్ర(Vikrant Rudra) దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే క్యురియాసిటీని టీజర్ మరింతగా పెంచింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వడానికి 9నెలలు మోస్తుంది. నేను కూడా ఈ సినిమాని మీకు చూపించడానికి తొమ్మిదేళ్లుగా మోశాను. నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్ ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో అలాగే నాటుకుపోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలి భావించను.

అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. నిర్మాత శ్రీను గారికి కథ చెప్పిన తర్వాత ఆయనకు నచ్చింది. వెంటనే ఓకే చెప్పారు. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రాజెక్టుకు కావలసిన ప్రతిదీ అద్భుతంగా సమకూర్చారు. ఆయన సపోర్ట్ లేకుండా ఈ సినిమా నేను చేసే వాడినే కాదు. ఈ ఆరేళ్ల జర్నీలో ఆయన ప్రతి మూమెంట్ లో సపోర్ట్ చేశారు. ఈ సినిమాని 120 లొకేషన్స్ లో షూట్ చేశాం. మా హీరో విజయ్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఎలాంటి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలన్నా అది చేసి చూపించారు. మైనస్ డిగ్రీల్లో షూట్ చేసాం. డిఓపి జగదీష్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడు. మేము అనుకున్నది తీయడానికి ఎంతకైనా సాహసించారు. సినిమాలో మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉంటుంది.

మా హీరోయిన్ సిజ్జా రోజ్(Sizza Rose) చాలా హార్డ్ వర్క్ చేసింది. సినిమా కోసం తెలుగు కూడా నేర్చుకుంది. ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా సినిమా టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ హను గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఇది నా ప్రామిస్'అన్నారు. ఇక హీరోయిన్ సిజ్జా రోజ్ మాట్లాడుతూ... ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. మీ అందరి సపోర్ట్ కావాలి. ఇది ఒక ఐదేళ్ల జర్నీ. చాలా ప్యాషన్ తో పని చేసాం. చాలా హార్డ్ వర్క్ చేశాం. మా నిర్మాత ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు. మా డైరెక్టర్ గారు తన విజన్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని చెప్పుకొచ్చింది.

Next Story