- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్ని గమనించి కసిగా ఈ సినిమా తీశా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది: విశ్వక్ సేన్

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి బౌండరీస్ ని దాటి ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో ‘CULT’ తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సినిమాల్లో తొలి స్లాషర్ జానర్ చిత్రంగా ‘CULT’ వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన రా, అన్‌కంప్రమైజింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. రక్తంతో తడిసిన, ఇంటన్ లుక్‌లో విశ్వక్ సేన్ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే భారీ హైప్ సృష్టించగా, తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని మరింత పెంచింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మాట్లాడుతూ..జనాలు. ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? ఇవన్నీ నేను గమనిస్తున్నాను. అవన్నీ కలిపికొట్టి ఈ సినిమా తీశాను.
పలక్ నామ దాస్ తీయకముందు నాలో ఒక కసి ఆకలి ఉండేది. ఈ సినిమా తీసే ముందు కూడా ముందు కూడా ఆ కసి పదింతలు పెరిగింది. అంత కసిగా ఈ సినిమా తీశాను. ఈ టీజర్ లో మీరు ఏమి చూడలేదు. జస్ట్ చివర్లో ఒక షాట్ పెట్టాను. పిల్లలు, సున్నిత మనస్కులని ఈ సినిమాకి దూరంగా ఉంచండి. తారక్ అద్భుతంగా పెర్ఫాం చేశాడు. గాయత్రి చాలా ప్రొఫెషనల్. తనకు సినిమా అంటే చాలా పాషన్. ఈ మూవీకి ఒక కన్ను తరుణ్ భాస్కర్ అయితే మరొక కన్ను రవి బస్రూర్ సార్. సౌండ్ చూసుకున్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. మ్యూజిక్ మామలుగా ఉండదు. ఆయనకి ఒక చిన్న కానుకగా రోలెక్స్ వాచ్ ని బహుమతిగా ఇస్తున్నాను. ఆయన ఇచ్చిన మ్యూజిక్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమాలో దాదాపు 100 మంది కొత్త నటీనటులు ఉన్నారు. అందరూ కూడా క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు. పలక్ నామా కథ చెప్పినప్పుడు నీవే డైరెక్షన్ చేయాలని ప్రోత్సహించాడు తరుణ్ ప్రోత్సహించాడు. ఈ సినిమా కథ విని నివ్వె చేయాలని చెప్పాడు. తను నా బ్లడ్ బ్రదర్. కాలేజీలో రీఓపెనింగ్ సమయానికి సినిమాని మీ ముందుకు తీసుకు వస్తాను’’ అని అన్నారు.






