- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది.. అతడితో ఉన్న క్షణాల గురించి సోనమ్ బాజ్వా పోస్ట్..
పంజాబీ నటి సోనమ్ బాజ్వా(Sonam Bajwa) ‘షాదీ, సింగం, క్వారీ ఆన్ జట్టా-3 వంటి సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

దిశ, సినిమా: పంజాబీ నటి సోనమ్ బాజ్వా(Sonam Bajwa) ‘షాదీ, సింగం, క్వారీ ఆన్ జట్టా-3 వంటి సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే పలు చిత్రాల్లో గెస్ట్ రోల్‌లోనూ నటించిన సోనమ్.. అభిమానులను పెంచుకుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘హౌస్‌ఫుల్-5’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సోనమ్ ‘ఏక్ దివానే కే దీవానియాత్’(Ek Deewane ki DEEWANIYAT) సినిమాలో నటిస్తోంది. అయితే ఇందులో హర్షవర్ధన్ రాణే (Harshavardhan Rane)సరసన ఈ భామ రొమాన్స్ చేయనుంది. అన్ని అంశాలతో కలిగిన ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాకు మిలాప్ జవేరి(Milap Zaveri) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా, సోనమ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
‘‘'ఏక్ దీవానే కి దీవానియత్' చిత్రీకరణ పూర్తయిందని నేను రాస్తున్నానని నమ్మలేకపోతున్నాను. ఇప్పటివరకు నేను చిత్రీకరించిన అత్యంత కష్టతరమైన చిత్రాలలో ఇది ఒకటి అయినప్పటికీ, ఈ అనుభవం చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ, దీవానియత్ బృందానికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. మీరందరూ లేకుండా ఇది సాధ్యం కాలేదు’’ అని రాసుకొచ్చింది. అలాగే షూటింగ్ సమయంలో హీరోతో పాటు పలువురితో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం సోనమ్ బాలీవుడ్‌లో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. టైగర్ ష్రాఫ్ సరసన ‘బాఘి-4’ మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు బోల్డ్ ఫొటోలతో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తుంది.






