ఈ సంస్కృతి నాకు చిరాకు తెప్పిస్తుంది.. నేషనల్ క్రష్ ట్యాగ్‌పై మనోజ్ బాజ్‌పేయీ షాకింగ్ కామెంట్స్.. రష్మికను ఉద్దేశించేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-13 06:57:52  IST  )

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ(Manoj Bajpayee) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఈ సంస్కృతి నాకు చిరాకు తెప్పిస్తుంది.. నేషనల్ క్రష్ ట్యాగ్‌పై మనోజ్ బాజ్‌పేయీ షాకింగ్ కామెంట్స్.. రష్మికను ఉద్దేశించేనా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ(Manoj Bajpayee) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన ఓవైపు మూవీస్ చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’తో రాబోతున్నారు. మనోజ్ నటిస్తున్న చిత్రాల్లో ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ (Police Station Main Bhoot)ఒకటి. హారర్ సినిమాగా రాబోతుండగా.. వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనోజ్ నేషనల్ క్రష్ ట్యాగ్‌పై అసహనం వ్యక్తం చేశారు. ‘‘పియూశ్ (Piyush)లాంటి గొప్ప నటులు ఎన్నో రోజులు ట్రైనింగ్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చారు. కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి అతని తర్వాత వచ్చిన వారిని ఉత్తమ నటులు అని అనడం ఆయనను అవమానించడం అవుతుంది.

గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా మారాయి. రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌లు అయిపోతున్నారు. ట్యాగ్‌లు పెట్టుకుంటున్నారు. నేను ఏదైనా సినిమాలో గొప్పగా నటించాను అనుకునేలోపే పీఆర్ టీమ్ వేరే నటుడిని హైలైట్ చేస్తుంది. దీంతో వారు గుర్తింపు పొందుతున్నారు.. మిగతా వారు ప్రశంసలకు దూరమవుతున్నారు. ఈ సంస్కృతి నాకు చిరాకు తెప్పిస్తోంది. అస్సలు నచ్చలేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్.. మనోజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఉద్దేశించే అన్నారనే చర్చలు మొదలయ్యాయి. మరికొందరు మాత్రం ట్యాగ్‌ల గురించి మాట్లాడారని ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story