నా గురించి ఆలోచిస్తూ.. అలాంటి పనులతో డబ్బు వృధా చేసుకోకండి: కంగనా కామెంట్స్

by Disha Web Desk 6 |
నా గురించి ఆలోచిస్తూ.. అలాంటి పనులతో డబ్బు వృధా చేసుకోకండి:  కంగనా కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రానౌత్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ నాయకుల పట్ల కూడా కంగనా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలుపుతుంది. ప్రస్తుతం చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ నా సినిమాల గురించి కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో అసత్యపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాలు డిజాస్టర్‌గా కొందరు ప్రచారం చేస్తున్నారు. రూ. 150 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమాలను కూడా ఫ్లాప్ సినిమాలుగా చిత్రీకరిస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ ప్రచారాలు చేయిస్తున్నారు. దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. ఇలాంటి ప్రచారాలు చేస్తునటువంటి వారికి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. నా గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కోసం రాత్రి పగలు ఆలోచిస్తూ సమయం డబ్బులు వృధా చేసుకోకండి’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More: ‘టైగర్ నాగేశ్వరరావు’ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్



Next Story

Most Viewed