- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2023 మిస్ ఇండియా నందిని గుప్తా గురించి ఎవరికీ తెలియని విషయాలు..
2023 లో 59వ ఎడిషన్ అందాల పోటీలో నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా కీరిటాన్నిదక్కించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: 2023 లో 59వ ఎడిషన్ అందాల పోటీలో నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా కీరిటాన్నిదక్కించుకుంది. ఏప్రిల్ 15న మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన ఫైనల్స్‌లో, 29 రాష్ట్రాలకు చెందిన 30 మంది అందాల భామలు టైటిల్ కోసం పోటీ పడ్డారు. ఇందులో కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే నందిని గెలిచింది . దీంతో 2022 సినీ శెట్టి మిస్ వరల్డ్ పోటీల తదుపరి ఎడిషన్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే నందికి గెలుచుకుంది. అయితే నందిన గుప్తా గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
నందిని గుప్తా రాజస్థాన్‌లోని కోటా నగరానికి చెందినది. సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో చదువుకుండి. ఆ తర్వాత బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో లాలా లజపత్ రాయ్ కాలేజీలో తన డిగ్రీని పూర్తి చేసింది. పదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎప్పటికైనా మిస్ ఇండియా అవ్వాలని ఆశ పడిందట. 19 ఏళ్ల వయసులో ఆ కోరికను నెరవేర్చుకుంది. ఆ ప్రయాణంలో ఎన్నో చేదు అనుభవాలు, ఛీత్కారాలు, ఎదురుదెబ్బలు తగిలినా వాటిని భరించి విజయాన్ని అందుకుంది. ఎంతో మంది బంధువులు, స్నేహితులు విమర్శించినా తన కల నెరవేర్చుకోవడం పైనే ఆమె దృష్టి పెట్టిందట.






