- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘కోట్ల రెమ్యూనరేషన్లు కావాలి.. కానీ ప్రేక్షకుడు నోరు మెదపకూడదా".. బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్
టాలీవుడ్ నటుడు బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) సోషల్ మీడియా ద్వారా ఓ సంచలన ట్వీ్ట్ పెట్టి వార్తల్లో నిలిచాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) సోషల్ మీడియా ద్వారా ఓ సంచలన ట్వీ్ట్ పెట్టి వార్తల్లో నిలిచాడు. టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రస్తుతం కుదిపేస్తున్న రివ్యూ మాఫియా, డిఫమేషన్ కేసులు మరియు టికెట్ ధరల పెంపుపై నటుడు బండి సరోజ్ కుమార్ విరుచుకుపడ్డాడు. సినిమా వాళ్లకు కోట్లలో రెమ్యూనరేషన్లు కావాలి.. కానీ ప్రేక్షకుడు మాత్రం రివ్యూ ఇవ్వకూడదా?" అంటూ నటుడు బండి సరోజ్ కుమార్ టాలీవుడ్ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. కవర్లు తీసుకొని రాసే పెయిడ్ రివ్యూయర్లను పబ్లిక్ ఎప్పుడో పక్కన పెట్టేశారని, అందుకే వారి ఇంటర్వ్యూలు కూడా ఎవరూ చూడటం లేదని ఆయన అన్నారు. యూట్యూబ్ రివ్యూయర్లపై కేసులు పెట్టడం వల్ల వారి గొంతుకు మరింత బలం చేకూరుతుందే తప్ప, ఇండస్ట్రీకి వచ్చే లాభం ఏమీ ఉండదని.. ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉందని ఆయన గుర్తు చేశారు.
పరిశ్రమ బాగుండాలంటే రివ్యూలను ఆపడం కంటే టికెట్ రేట్లను తగ్గించడంపై దృష్టి పెట్టాలని సరోజ్ కుమార్ పేర్కోన్నారు. భారీ బడ్జెట్ పేరుతో టికెట్ ధరలను సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లి, మళ్ళీ కలెక్షన్లు కావాలని కోరుకోవడం హాస్యాస్పదమని విమర్శించాడు. టికెట్ ధరలను నియంత్రిస్తే థియేటర్లకు జనం వాటంతట వాళ్లే వస్తారని, అప్పుడు రివ్యూలతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. రివ్యూలు నచ్చకపోతే నేరుగా పోరాడాలి తప్ప, చట్టపరమైన చర్యల పేరుతో భయపెట్టాలని చూడటం సరికాదని ఇండస్ట్రీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.






