అవకాశాల కోసం ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకోమన్నారు.. యంగ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఈ రంగుల ప్రపంచంలో.. నటీనటులకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.

అవకాశాల కోసం ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకోమన్నారు.. యంగ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఈ రంగుల ప్రపంచంలో.. నటీనటులకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇక సినీ ఇండస్ట్రీలో రాణించేందుకు కొందరు తమను తాము పూర్తిగా మార్చుకుంటారు. అలాగే మరికొందరు మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇక ఈక్రమంలోనే.. పలు చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ సైలెంట్‌గా ఉంటారు. ఏదో ఒక వంకతో ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వకపోయినా.. వచ్చిన వాటితో సరిపెట్టుకుంటుంటారు. తాజాగా, ఓ నటికి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి ఆయేషా ఖాన్(Ayesha Khan).. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.

‘‘ఓ వ్యక్తి నా ముక్కుకు సర్జరీ చేయించుకోమన్నాడు. అది విని నేను చాలా షాక్ అయ్యాను. నాకు నా ముక్కంటే చాలా ఇష్టం. అలాంటిది సర్జరీ చేయించుకోమని చెప్పడానికి అతడెవరు? ఇలాంటి వాళ్లు లైఫ్‌లో ముందుకెళ్లరు. కానీ పక్కవాళ్ల మీద పడి ఏడుస్తారనిపించింది. ఒకసారి హారర్ సినిమా ఆడిషన్‌కి వెళ్లాను. ఆయన ఫేమస్ డైరెక్టర్. ఆడిషన్ పూర్తయింది. అది వాళ్లకు నచ్చింది. కచ్చితంగా నన్నే సెలెక్ట్ చేస్తారని అన్నారు. అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే.. హారర్ సినిమాలో చాన్స్ రావాలంటే నీ పళ్ల వరస మార్చుకోమన్నారు. అప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. దీంతో అక్కడి నుంచి వచ్చేశాను’’ అని చెప్పుకొచ్చింది.

కాగా.. ఈ అమ్మడు హిందీలోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గ్యాంగ్ ఆఫ్ గోదావరి, ముఖచిత్రం, ఓం భీమ్ బుష్ వంటి చిత్రాల్లో కనిపించింది. అలాగే పలు స్పెషల్ సాంగ్స్‌లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘ధురంధర్’ (Dhurandhar)మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. రణ్‌వీర్ సింగ్(Ranveer Singh), మాధవన్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. కాసలు వర్షం కురిపిస్తూ.. ప్రశంసలు, విమర్శలు పొందుతోంది. ప్రస్తుతం ఆయేషా ఖాన్ ‘కిస్ కిస్కో ప్యార్ కరూ-2’ సినిమాలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.

Next Story