వాళ్లకు నా శరీరంతోనే పని.. ఆ నొప్పిని భరించలేకపోతున్నానంటూ అసలు విషయాలు చెప్పేసిన హీరోయిన్

by Mallepaka Hamsa |

కేరళ బ్యూటీ మంజిమా మోహన్(Manjima Mohan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

వాళ్లకు నా శరీరంతోనే పని.. ఆ నొప్పిని భరించలేకపోతున్నానంటూ అసలు విషయాలు చెప్పేసిన హీరోయిన్
X

దిశ, సినిమా: కేరళ బ్యూటీ మంజిమా మోహన్(Manjima Mohan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2015లో ‘ఓరు వడక్కల్ సెల్ఫీ’ మూవీతో హీరోయిన్‌గా మారింది. ఇక తెలుగులో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (Sahasam Swasaga Sagipo)చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. చివరగా విశ్వక్ సేన్ ‘బూ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. గత రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటుంది. మంజిమా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. నటుడు గౌతమ్ కార్తీక్‌ను 2022లో ప్రేమ పెళ్లి చేసుకుంది.

ఇక అప్పటినుంచి సినిమాలకు దూరమై.. భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈక్రమంలోనే.. పలువురు నెటిజన్లు మంజిమా బరువుపై పలు కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ చేయడంతో పాటు వెయిట్ తగ్గమని సలహాలు ఇస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంజిమా షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘చాలామంది నన్ను బరువు తగ్గమని చెప్తూ దారుణంగా మాట్లాడుతున్నారు. బరువు తగ్గితే నాకు సినిమా అవకాశాలు వస్తాయి.. కానీ జీవితానికి అదే ముఖ్యం కాదు. హీరోయిన్లను విమర్శించేవారికి నా శరీరమే కావాలి.

ఇంకేమీ కనిపించవా.. సినిమా అనేది నా జీవితంలో ఒక భాగం మాత్రమే అదే లైఫ్ కాదు. నాకు ఇంకా ఆశయాలు ఉన్నాయి. బరువు పెరగడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇక ఆ నొప్పిని భరించలేకపోతున్నాను. ప్రతి ఒక్కరై హెల్దీగా, ఫిట్‌గా ఉండాలనే అనుకుంటారు. కానీ కొందరు మాత్రం సహజసిద్ధంగానే లావుగా ఉంటారు. ఈ విషయంలో వారికి తప్పుపట్టలేం. నేను కూడా గతంలో బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకోవాలనుకున్నాను. కాబట్టి దయచేసి ఒకరి శరీరాకృతిపై కామెంట్లు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. అవి వారి మనసును ఎంత బాధపెడతాయో గుర్తుంచుకోండి’’ అని చెప్పుకొచ్చింది.

Next Story