- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను విడాకులు తీసుకుంటే వాళ్ళు సంబరాలు చేసుకున్నారు.. సమంత షాకింగ్ కామెంట్స్!
స్టార్ బ్యూటీ సమంత (Samantha)తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని కొద్ది కాలం ఇండస్ట్రీలో రాణించింది.

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ సమంత (Samantha)తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని కొద్ది కాలం ఇండస్ట్రీలో రాణించింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ వైపు పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కొద్ది కాలంపాటు బాగానే ఉన్నప్పటికీ నాగచైతన్యతో మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి కూడా దూరమైంది. మయోసైటీస్ రావడంతో విదేశాల్లో చికిత్స తీసుకుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామం మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇటీవల ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను స్థాపించి తన మొదటి మూవీని తెరకెక్కించింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టకుంది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది.
ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఎప్పుడో జరిగిన విడాకుల గురించి పలు కామెంట్లు చేయడం గమనార్హం. ‘‘నా సినీ కెరీర్‌లో కాదు వ్యక్తి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నన్ను ద్వేషించే వాళ్ళు నా దుస్థితిని చూసి నవ్వుకున్నారు. ముఖ్యంగా నేను విడాకులు తీసుకున్నప్పుడు కొందరు సంబరాలు చేసుకున్నారు. నా జీవితంపై వ్యాఖ్యానిస్తూ.. నా భవిష్యతు గురించి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా చర్చించుకోవడం నన్ను బాధకు గురిచేసింది. కానీ నేను ఆ సమయంలో ఎవరిని పట్టించుకోలేదు. నా పని నేను చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నన్ను నేను ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికీ కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయినా నాకు బాధలేదు’’ అని చెప్పుకొచ్చింది.






