- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోక తప్పదు.. రకుల్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో ఈ మధ్య ఒకరిని తొక్కేయడానికి మరొకరు చేస్తున్న 'పీఆర్ వార్స్' (PR Wars) గురించి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)షాకింగ్ నిజాలు బయటపెట్టింది.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ఈ మధ్య ఒకరిని తొక్కేయడానికి మరొకరు చేస్తున్న 'పీఆర్ వార్స్' (PR Wars) గురించి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)షాకింగ్ నిజాలు బయటపెట్టింది. పబ్లిసిటీ కోసం పీఆర్ టీమ్స్‌ని వాడుకోవడం పక్కన పెడితే, ఇప్పుడు డబ్బులు ఇచ్చి మరీ పక్కవారి మీద విషం చిమ్మే సంస్కృతి పెరిగిపోతోందని రకుల్ మండిపడింది. ‘‘పీఆర్ వ్యవస్థలు కొంతవరకే ఉపయోగపడతాయి.. అసలు గుర్తింపు మనం చేసే కష్టం వల్లే వస్తుంది. కానీ ఈ మధ్య బాలీవుడ్‌లో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. ఒకరి మీద బురద చల్లడానికి డబ్బులు ఖర్చు పెట్టి మరీ నెగిటివిటీని ప్రచారం చేయిస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇలాంటి నీచమైన పనులు చేసే వారిపై రకుల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ‘‘ఇంతలా నెగిటివిటీని పెంచుతూ ఇతరులని ఇబ్బంది పెట్టే వాళ్లకు అసలు నిద్ర ఎలా పడుతుంది? అసలు వాళ్ళు మనుషులేనా.. మనస్సాక్షి అనేదే ఉండదా? అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది. ఇలాంటి వాళ్లు ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ చాలా సీరియస్‌గా హెచ్చరించింది. తాను ఎవరి సాయం లేకుండా స్వశక్తితో ఎదిగి ఈ స్థాయికి వచ్చానని, తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి లేదా ఇతరులను తక్కువ చేయడానికి ఇలాంటి చీప్ పీఆర్ పద్ధతులు తనకు అస్సలు అవసరం లేదని రకుల్ స్పష్టం చేసింది.
కేవలం ఇండస్ట్రీ పాలిటిక్స్ మీదే కాకుండా, తన వెంటపడే ఫోటోగ్రాఫర్ల మీద కూడా రకుల్ ఫైర్ అయ్యింది. ‘‘నేను ఒకే జీన్స్‌ను నెలకు ఐదుసార్లు వేసుకుంటాను.. అది నా ఇష్టం. దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ కామెంట్స్ చేస్తున్నారంటే వాళ్ళకి హద్దులు లేవనిపిస్తోంది. సినిమా వేడుకల్లో తప్ప, మామూలు సమయాల్లో నేను కొత్త బట్టల కంటే.. నాకు ఏది కంఫర్ట్‌గా ఉంటే అదే వేసుకుంటాను’’ అని రకుల్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.






