ఇలాంటి ట్రోల్స్ నన్నేమి చేయలేవు.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్ భర్త

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-16 07:26:51  IST  )

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి(Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా(Raj Kundra) ఓ పెట్టుబడి ఒప్పందానికి సంబంధించిన కేసులో కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఇలాంటి ట్రోల్స్ నన్నేమి చేయలేవు.. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్ భర్త
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి(Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా(Raj Kundra) ఓ పెట్టుబడి ఒప్పందానికి సంబంధించిన కేసులో కొన్ని రోజులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరు గత కొద్ది రోజులుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్‌ స్వామిజీని కలిశారు. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే ఆయన అనారోగ్యం‌తో బాధపడుతున్నారని తెలుసుకున్న రాజ్ కుంద్రా ఆయనకు తన కిడ్నీని దానంగా ఇస్తానని మాటిచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో వాటిని చూసిన నెటిజన్లు పెట్టుబడి కేసును కప్పిపుచ్చుకోవడానికే స్వామిజీని కలిశారనడి దారుణంగా మాట్లాడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, రాజ్ కుంద్రా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘‘ఈ వింత ప్రపంచంలో.. మరొకరి ప్రాణాలు కాపాడటానికి శరీరంలోని ఒక పార్ట్ ఇవ్వడానికి సిద్ధపడితే ఎగతాళి చేస్తున్నారు. ఇది పీఆర్ స్టంట్ అంటూ నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఒకవేళ మీ దృష్టిలో మంచి తనం కూడా ఓ స్టంట్ అయితే దాన్ని ప్రపంచం ఎక్కువగా చూడనివ్వండి. మానవత్వం కూడా ఓ వ్యూహమైతే దాన్ని ఎక్కువ మంచి స్వీకరించనివ్వండి.

మీరు చేసే వ్యాఖ్యలు, ట్రోల్స్ నన్నేం ఏం చేయలేదు. వాటి వల్ల నేనేం బాధపడను. అవి నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేవు. మీ దృష్టిని ఆకర్షించడం కోసం నేను స్వామీజీకి కిడ్ని ఇస్తానని అనలేదు. ఎదుటి వారి గురించి తక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా ప్రేమను పంచండి. అప్పుడే మీరు మరొకరి జీవితాల్లో వెలుగులు నింపగలరు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పటికైనా ట్రోల్స్‌కు చెక్ పడుతుందో లేదో చూడాలి.

link

Next Story