- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భోళా శంకర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయినప్పటికీ అభిమానులను అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా కూడా నిరాశపరిచింది. కాగా మొదటి రోజు ఈ చిత్రం రూ. 20 నుంచి 25 కోట్ల మధ్య వసూలు చేసింది. అయితే ఈ మూవీకి ఒక రోజు ముందు విడుదలైన రజనీకాంత్ ‘జైలర్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి షో నుంచి అద్భుతమైన ఓపెనింగ్‌తో కేవలం రెండు రోజుల్లో రూ. 75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో రాబోయే రోజుల్లో చిరంజీవి సినిమాపై రజనీకాంత్ చిత్రం పైచేయి సాధించే అవకాశముందనే టాక్ వినపడుతుంది. కానీ ఇలా రజనీకాంత్ సినిమా కలెక్షన్స్‌ను.. చిరు మూవీతో పోల్చడం సరికాదు. ఎందుకంటే రజనీకాంత్ మార్కెట్, తమిళం, కన్నడలోనూ ఎక్కువ ఉంది. ఇక చిరంజీవి మూవీ గురించి ముందు నుంచి కొంచెం నెగిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు కలెక్షన్స్ మీద బాగా ప్రభావం చూపిందని చెప్పాలి. ఇక ఈ వీక్ ఎండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.
Read More: మాస్ మహారాజ్ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి సాలిడ్ అప్డేట్..!






