- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్లామర్ షో చేయడం తప్పేమీ కాదు.. మీరెవరూ నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు: మడోన్నా సెబాస్టియన్
ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు సినిమా అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

దిశ, సినిమా: ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు సినిమా అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొంతమంది హీరోయిన్‌గా అవకాశాలు రాకపోయినప్పటికీ క్యారెక్టర్, ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, స్పెషల్ సాంగ్స్ వంటివి చేస్తూ తమ పాపులారిటీని పెంచుకుంటున్నారు. ఇక తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మడోన్నా సెబాస్టియన్(Madonna Sebastian) ఒకరు. ప్రేమమ్(Premam), శ్యామ్ సింగరాయ్(Shyam Singaray) వంటి చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ భామ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. అయినప్పటికీ కొద్ది కాలంపాటు సైలెంట్‌గా ఉన్న మడోన్నా.. గత కొద్ది రోజులుగా అందరి హీరోయిన్లలా గ్లామర్ షో చేస్తూ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. పొట్టి బట్టలు ధరిస్తూ గ్లామర్ షోతో రెచ్చిపోతూ అందరికీ షాకిస్తోంది. దీంతో వాటిని చూసిన నెటిజన్లు కొందరు అసభ్య కామెంట్లు చేస్తూ అవకాశాల కోసమే ఇలా చేస్తుందని దారుణంగా విమర్శలు చేస్తున్నారు.
ఇక ఈ కామెంట్లు చూసిన మడోన్నా సోషల్ మీడియాలో ద్వారా స్పందించి తనను విమర్శిస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘‘గ్లామర్ షో చేయడం తప్పేమీ కాదు. కానీ గ్లామర్‌కు, అసభ్యతకు మధ్య వ్యత్సాసం ఏంటనేది తెలిస్తే చాలు. మీరెవరు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ నాకు తెలుసు. నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలుసు. కాబట్టి ఎవరి పని వారు చూసుకుంటే మంచిది. ఒకరు ఎలాంటి దుస్తులు ధరించాలనేది మీరు నిర్ణయించేది కాదు. నా బాడీ నా ఇష్టం నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను. మీకు చూడాలని లేకపోతే చూడకండి’’ అని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే గ్లామర్ షో చేయడానికి సిద్ధమని క్లారిటీ ఇచ్చింది. ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.






