- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి దాంట్లో నేర్చుకునే విషయం ఉంటుంది.. సినిమాలకు దూరం అవడంపై కంగనా రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) అడపా దడపా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) అడపా దడపా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న కంగనా నాయకులకు తనదైన స్టైల్లో వార్నింగ్‌లు ఇస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తనకు ఏది అనిపిస్తే అది ధైర్యం చెబుతూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా, కంగనా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరిచింది. మీకు రాజకీయాలంటే ఇష్టమా సినిమాలా? అని అడగ్గా.. ‘‘మనిషి జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రమే ఇష్టం పడాల్సిన పనిలేదు. కాలం మారితే మన అభిరుచులు కూడా మారుతాయి.
ప్రతి దాంట్లో నేర్చుకునే విషయం ఉంటుంది. నాకు రాజకీయాలు, సినిమాలు రెండూ సమానమే. ఏది ఇష్టమంటే చెప్పలేను. ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడగడం మానుకోండి’’ అని చెప్పింది. ఇక మరో నెటిజన్ మళ్లీ సినిమాల్లో కనిపిస్తారా.. లేక పూర్తిగా దూరం అవుతారా? అని అడగ్గా.. దానికి కంగనా‘‘ఓ కథపై ప్రస్తుతం వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నాను. స్క్రిప్ట్ రెడీ చేసే స్టేజ్‌లో ఉన్నాం. త్వరలోనే పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నాము’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ అమ్మడు చివరగా ‘ఎమర్జెన్సీ’ సినిమాతో అలరించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ హిట్ అందుకోలేకపోయింది.






