- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా భాష జోలికొస్తే ఊరుకునేది లేదు.. కమల్ హాసన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చిన కన్నడ హీరో!
కన్నడ స్టార్ ధృవ సర్జా(Dhruva Sarja) నటించిన లేటెస్ట్ మూవీ ‘కేడీ: ది డెవిల్’(KD – The Devil).

దిశ, సినిమా: కన్నడ స్టార్ ధృవ సర్జా(Dhruva Sarja) నటించిన లేటెస్ట్ మూవీ ‘కేడీ: ది డెవిల్’(KD – The Devil). వయోలెంట్ అండ్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రేష్మ నానయ్య హీరోయిన్‌గా నటించగా.. శిల్పా శెట్టి(Shilpa Shetty), సంజయ్ దత్, రమేశ్ అరవింద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రేమ్ దర్శకత్వం వహించాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధం అవుతుండగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ధృవ సర్జా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ తమిళ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని అని యాంకర్ అడగ్గా.. ‘‘నేను పుట్టకముందు నుంచే కర్ణాటకలో బోలెడన్ని తమిళ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఏ ఒక్క మూవీని ఎవరూ ఆపలేదు. కమల్ సర్ అలాంటి కామెంట్స్ చేయడం వల్ల ‘థగ్‌లైఫ్’ విడుదలను అడ్డుకున్నారు. ఎవరికైనా మాతృబాష అంటే ప్రత్యేక గౌరవం ఉంటుంది. అందరిలాగే మేమూ మా భాషను ప్రేమిస్తాం. మా బాష గురించి తప్పుగా మాట్లాడితే జనాలు స్పందించకుండా ఉండరు కదా. ‘థగ్‌లైఫ్’ మినహా అన్ని తమిళ చిత్రాలు ఏ ఇబ్బందీ లేకుండా రిలీజ్ అయ్యాయి. వాటిని కన్నడిగులు ఆదరించారు. మా మాతృబాష జోలికొస్తే, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరూ ఊరుకోరు’’ అని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇటీవల కమల్ హాసన్ ‘థగ్‌లైఫ్’ విడుదలకు ముందు కన్నడ భాషపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటకలో ఈ చిత్రాన్ని రిలీజ్ కాకుండా అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. అయినప్పటికీ కమల్ హాసన్ మాత్రం క్షమాపణలు చెప్పలేదు.






