- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..పుకార్లకు చెక్ పెడుతూ నాగవంశీ ఆసక్తికర కామెంట్స్
హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్(NTR) కాంబోలో వచ్చిన సినిమా ‘వార్-2’.

దిశ, సినిమా: హృతిక్ రోషన్(Hrithik Roshan), ఎన్టీఆర్(NTR) కాంబోలో వచ్చిన సినిమా ‘వార్-2’. ఇందులో కియారా అద్వానీ,అశుతోష్ రాణా కీలక పాత్రలో కనిపించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా.. విమర్శలు ఎదుర్కొంది. మొదటిరోజు నుంచే ఈ సినిమా కొందరు కావాలనే ట్రోలింగ్ చేశారు. పెట్టిన బడ్జెట్ కూడా రాకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. ఇక తెలుగు రైట్స్‌ను రూ. 80 కోట్లకు నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు.
ఈ సినిమా డిజాస్టర్‌గా మిలిగిపోవడంతో సుమారు రూ. 50 కోట్లు నష్టపోయాడటని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆయన నష్టాల రావడం వల్ల దేశం వదిలి పారిపోయారనే పుకార్లు కూడా వస్తున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ (Nagavamsi)ఈ విషయాలపై స్పందిస్తూ.. ‘‘వార్-2 సినిమా వల్ల నేను భారీగా నష్టపోయానని చాలామంది అంటున్నారు. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. తెలుగు రైట్స్ రూ. 68కోట్లకు దక్కించుకున్నాను. మూవీ క్లోజింగ్ అయ్యేసరిగి రూ. 40 కోట్ల వరకు షేర్ వచ్చింది. అయితే యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నాకు రూ. 18 కోట్లు రిటర్న్ ఇచ్చింది. బాంబే కంపెనీ అయినప్పటికీ వారు నిజాయితీగానే తిరిగి డబ్బులు ఇచ్చేశారు. ‘వార్-2’ వల్ల నేను నష్టపోలేదు నా డబ్బు నాకు దక్కింది’’ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Related News : ‘డ్రాగన్’ నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా ఉండబోతోంది: రుక్మిణి వసంత్






