ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. రెస్టారెంట్ మూసివేయడంపై బిగ్ ట్విస్ట్ ఇస్తూ షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన శిల్పా శెట్టి

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి(Shilpa Shetty) ముంబైలో ఉన్న తన ‘బాస్టియన్’ (Bastian)రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. రెస్టారెంట్ మూసివేయడంపై బిగ్ ట్విస్ట్ ఇస్తూ షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన శిల్పా శెట్టి
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి(Shilpa Shetty) ముంబైలో ఉన్న తన ‘బాస్టియన్’ (Bastian)రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్‌ను ఇప్పుడు క్లోజ్ చేస్తుండటంతో అంతా ఆశ్చర్యపోయారు. అలాగే ఏ కష్టం వచ్చిందో అని అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు పోస్టులు పెడుతున్నారు. అలాగే దానిని అమ్ముతున్నట్లు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది. ‘‘బాస్టియన్ పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వేల ఫోన్లు వస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. బాంద్రాలోని బాస్టియన్ రెస్టారెంట్ మాకు రూట్ లాంటిది.

ఒక చెట్టుకు ఫలాలు ఎలా లభిస్తాయో .. ఇప్పుడు బాస్టియన్ కూడా కొత్త ఫలాన్ని అందించనుంది. అక్కడే ‘అమ్మకై’ పేరుతో దక్షిణ భారతదేశ వంటకాలు అందించబోతున్నాం. మీకు ఇష్టమైన బాస్టియన్ కూడా ఉంటుంది. కానీ బీచ్ క్లబ్ పేరుతో జుహు ప్రాంతంలో ప్రారంభించబోతున్నాం. కాబట్టి బాస్టియన్ క్లోజ్ చేశాం అనే వార్తల్లో నిజం లేదు. నా సోదరుడు రంజిత్ బింద్రా వాటికి సీఈవోగా ఉన్నారు. అతని ఆలోచన వల్లే బాంద్రాలో దక్షిణ భారతదేశ వంటకాలు అక్టోబర్ నెలలోనే ప్రారంభమవుతాయి’’ అని చెప్పుకొచ్చింది. మూసివేస్తున్నట్లు ప్రకటించిన శిల్పా ఈ వీడియో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమె కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story