- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. అనుకున్న తేదీకే రాబోతున్నామంటూ కిచ్చా సుదీప్ పోస్ట్
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)గత ఏడాది ‘మ్యాక్స్’ ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)గత ఏడాది ‘మ్యాక్స్’ ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం రియాలిటీ షోకు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటు ‘మార్క్’(Mark) మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయన కెరీర్‌లో 47వ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి విజయ్ కార్తికేయ(Vijay Karthikeya) దర్శకత్వం వహిస్తున్నారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా, కిచ్చా సుదీప్ ‘మార్క్’ అప్డేట్ ఇచ్చారు. ‘‘జూలై 7న, మా బృందం మొత్తం ఒకే ఉద్దేశ్యంతో బయలుదేరింది. ఈ ప్రాజెక్ట్ చేయడం మొదట్లో అసాధ్యం అనిపించిన దానిని సాధించాలని పట్టుదలతో మొదలుపెట్టాం. తక్కువ సమయంలో పూర్తి చేయడం అనేది ఒక భారీ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ఇప్పుడు అనుకున్నది సాధించాం. టీమ్‌లోని ప్రతి ఒక్కరి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ప్రతి సభ్యుడు ప్రతిరోజూ నిద్రలేని రాత్రులతో పని చేశారు.
లక్ష్యాన్ని చేరుకునే వరకు ‘మార్క్’ ప్రతి అడ్డంకిని అధిగమించాడు. దాదాపు 110 రోజుల అపారమైన కృషి, లెక్కలేనన్ని కాల్ షీట్ల తర్వాత షూటింగ్ ముగిసింది. మేము ప్రధాన CG, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డబ్బింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాము. ఈ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటే మాకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మీకు టీమ్ వాగ్దానం చేసినట్లుగా... ఈ క్రిస్మస్‌కి రాబోతున్నాం. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. విడుదలను వాయిదా వేసే అవకాశం లేదు’’ అని రాసుకొచ్చారు.






