పెళ్లైన వ్యక్తితో మహిళలు సహజీవనం చేస్తే తప్పుగా చూడనవసరం లేదు.. కంగనా హాట్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) చివరగా ‘ఎమర్జెన్సీ’ (Emergency)సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

పెళ్లైన వ్యక్తితో మహిళలు సహజీవనం చేస్తే తప్పుగా చూడనవసరం లేదు.. కంగనా హాట్ కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) చివరగా ‘ఎమర్జెన్సీ’ (Emergency)సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అడపా దడపా చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. అలాగే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా సహజీవనంపై హాట్ కామెంట్స్ చేసింది. ‘‘అమ్మాయిలు వయసులో ఉండి ఏదైనా సాధించాలనే పట్టుదలతో ఉన్నప్పుడు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న వ్యక్తి మీతో సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తే మగవాడి తప్పు లేదు.

కానీ మహిళలు పెళ్లి అయిన వాళ్లతో సంబంధం పెట్టుకుంటే మాత్రం జనాలు తప్పుగా చూస్తారు. ఇలాంటి సందర్భాల్లో మహిళ తప్పు చేసినట్లే పురుషుడు కూడా తప్పు చేస్తాడు కదా. కాబట్టి స్త్రీలను తప్పు చేసినట్లుగా చూడనవసరం లేదు. స్త్రీలనే మాత్రమే తప్పు పడతారు ఎందుకో నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను మగాళ్లనే టార్గెట్ చేస్తాను’’ అని చెప్పుకొచ్చింది. అలాగే డేటింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరికీ అవసరాలు ఉంటాయి. ఆర్థికంగా, శారీరకంగా లేదా ఇతరత్రా. మనం వాటిని ఎలా తీర్చాలి? అదే ప్రశ్న. వాటిని క్రూరంగా చేస్తామా? కానీ ఇప్పుడు డేటింగ్ అంటే అలాగే మారింది.

ఇది ఒక భయంకరమైన పరిస్థితి. డేటింగ్ యాప్‌లలో నాలాంటి వ్యక్తులు మీకు దొరకరు. జీవితంలో ఏమీ సాధించని ఓడిపోయిన వారిని మాత్రమే మీరు కనుగొంటారు. గర్భస్రావం చేయించుకోవడానికి మీకు ఎవరు సహాయం చేస్తారు? మీరు రేపు లివ్-ఇన్ సంబంధంలో గర్భవతి అయితే, మిమ్మల్ని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు? పురుషులు వేటగాళ్ళు, వారు ఏ స్త్రీనైనా గర్భం దాల్చి పారిపోగలరు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Next Story