Chinmayi: నన్ను ఆమెతో పోల్చి చూడాల్సిన అవసరం లేదు.. వయసులో చాలా చిన్నదంటూ చిన్మయి కీలక వ్యాఖ్యలు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-07 12:08:22  IST  )

టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి(Chinmayi Sripada) అందరికీ సుపరిచితమే. ఆమె ఎన్నో సాంగ్స్ పాడి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

Chinmayi: నన్ను ఆమెతో పోల్చి చూడాల్సిన అవసరం లేదు.. వయసులో చాలా చిన్నదంటూ చిన్మయి కీలక వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి(Chinmayi Sripada) అందరికీ సుపరిచితమే. ఆమె ఎన్నో సాంగ్స్ పాడి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే సమంతకు పలు చిత్రాల్లో డబ్బింగ్ చెప్పి తన వాయిస్‌తో అందరినీ మంత్రముగ్దులను చేసింది. అయితే కొన్నేళ్ల నుంచి కోలీవుడ్‌లో చిన్మయిపై బ్యా్న్ విధించిన సంగతి తెలిసిందే. సింగింగ్ అవకాశాలు డబ్బింగ్ ఆఫర్లు ఇవ్వొద్దని మేకర్స్ నిర్ణయించుకున్నారు. వైరముత్తుతో గొడవ వల్లే బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లు ఖాళీగా ఉన్న చిన్మయి సోషల్ మీడియా ద్వారా పలు వివాదాస్పద పోస్టులతో నిత్యం వార్తల్లో నిలిచింది. పలు విషయాలపై రియాక్ట్ అయిన ఆమె ట్రోల్స్ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు మాట్లాడేది. చాలా రోజుల తర్వాత చిన్మయి ‘థగ్‌లైఫ్’(Thuglife) చిత్రంలో ఓ పాట పాడింది. ఇక ఈ సాంగ్‌ను సింగర్ ధీ తమిళంలో పాడగా.. తెలుగు, హిందీ భాషల్లో పాడింది.

అయితే ఈ రెండు భాషల్లోనూ మంచి రెస్పాన్స్ దక్కించుకోవడం విశేషం. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘సింగర్ ధీ అందుబాటులో లేకపోవడం నేను థగ్‌లైఫ్ పాట పాడాను. దానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను పాడిన పాట వల్ల ఇద్దరి రెజ్లింగ్ అన్నట్టుగా పోటీ పెట్టి చూస్తున్నారు. అలా పోల్చాల్సిన అవసరం లేదు. ఇది ఎంత మాత్రం పోటీ కాదు. సింగర్ ధీకి చాలా ప్రత్యేకమైన వాయిస్ ఉంది. ఆమెను ఎవ్వరూ ఇమిటేట్ చేయలేరు. ఆమె చాలా టాలెంటెడ్. ఇంకా చిన్నది మున్ముందు చాలా వండర్స్ క్రియేట్ చేస్తోంది. ఫ్యూచర్‌లో వంద మంది చిన్మయిల్ని, శ్రేయా ఘోషల్ బీట్ చేస్తుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story