‘నీలాంటి మగాడు ఎక్కడా దొరకడు’.. ఆ హీరోపై రకుల్ ఎమోషనల్ పోస్ట్..

by sudharani |
‘నీలాంటి మగాడు ఎక్కడా దొరకడు’.. ఆ హీరోపై రకుల్ ఎమోషనల్ పోస్ట్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో రకుల్ ప్రీత్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ చిన్నది తనకంటూ మంచి ఫ్యాలోయింగ్, ఫేమ్ సంపాదించుకుంది. ఇక తెలుగు మాత్రమే కాకుండా పలు భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈ మధ్య ఆమెకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ప్రజెంట్ తమిళ్ ఇండస్ర్టీలో నటిస్తోంది. మూవీస్ విషయం పక్కనపెడితే రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈమె పెళ్లిపై పుకార్లు వచ్చాయి. కాగా మరోసారి కూడా ఆమె పెళ్లిపై రూమర్స్ గుప్పుమంటున్నాయి.

రకుల్ అతి త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. ఇక వీరు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చనున్నారట.. కాగా నేడు (డిసెంబర్ 26) జాకీ పుట్టినరోజు సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది రకుల్. ‘హ్యాప్పీ బర్త్ డే మై లవ్.. ఈ పుట్టినరోజు మాత్రమే కాదు.. ప్రతిరోజూ నువ్వు కోరుకున్నవన్నీ సమృద్ధిగా పొందాలని ఆశీస్తున్నాను. నీ దయ, అమాయకత్వం దొరకడం చాలా అరుదు.. ఇన్ని మంచి గుణాలున్న నీలాంటి మగాడు ఈరోజుల్లో దొరకడం కష్టం.. నీ స్నేహాన్ని ఎప్పటికీ మిస్ అవ్వను’ అంటూ రాసుకొచ్చింది. ప్రజెంట్ ఈ పోస్ట్, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed