- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా మధ్య ఎలాంటి అసూయ లేదు.. ఇక్కడ అందరికీ అవకాశాలు ఉంటాయి: అక్షయ్ కుమార్
ప్రేక్షకులు మళ్లీ ఇంటెన్స్ యాక్షన్ సినిమాలను ఆదరిస్తున్నారు. ధురంధర్ చిత్రంలో వైలెన్స్ ఉన్నప్పటికీ జనం దాన్ని బాగా ఎంజాయ్ చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, సినిమా ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఇండస్ట్రీ ఎలా మారుతుందో వివరిస్తూ, రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ హిట్ ‘ధురంధర్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ‘‘ప్రేక్షకులు మళ్లీ ఇంటెన్స్ యాక్షన్ సినిమాలను ఆదరిస్తున్నారు. ధురంధర్ చిత్రంలో వైలెన్స్ ఉన్నప్పటికీ జనం దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. రణవీర్ సింగ్ 'యాంగ్రీ యంగ్ మెన్' ఇమేజ్‌ను అద్భుతంగా పండించాడు’’ అని కొనియాడారు. ఈ సినిమాలో మీకు అవకాశం రానందుకు ఏమైనా బాధగా ఉందా? అని అడగ్గా.. అక్షయ్ చాలా హుందాగా సమాధానం ఇచ్చారు. ‘‘దర్శకుడు ఆదిత్య ధర్ బహుశా నేను ఆ పాత్రకు సెట్ అవ్వనని అనుకుని ఉండవచ్చు. అందుకే నాకు ఆ ఛాన్స్ రాలేదు. రణవీర్ నా వర్క్‌ను ఇష్టపడతాడు. నేను తన పనిని గౌరవిస్తాను. మా మధ్య ఎలాంటి అసూయ లేదు. ఏడాదికి 180 సినిమాలు వస్తుంటాయి. ఇక్కడ అందరికీ అవకాశాలు ఉంటాయి’’ అని స్పష్టం చేశారు.






