‘శశివదనే’ నాకు చాలా స్పెషల్.. ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ ఉంది.. కోమలి ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-04 09:43:14  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కోమలి ప్రసాద్(Komalee Prasad) ‘హిట్-3’ సినిమాతో సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది.

‘శశివదనే’ నాకు చాలా స్పెషల్.. ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ ఉంది.. కోమలి ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కోమలి ప్రసాద్(Komalee Prasad) ‘హిట్-3’ సినిమాతో సెన్సేషనల్ బ్యూటీగా మారిపోయింది. నాని చిత్రంతో అమ్మడుకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం కోమలి ప్రసాద్ ‘శశివదనే’ (Sasivadane )మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యంగ్ హీరో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తుండగా.. సాయి మోహన్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాకు బెల్లంకొండ అహితేజ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శశివదనే’ అక్టోబర్ 10న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

తాజాగా, ఓ వేడుకలో పాల్గొన్న కోమలి ప్రసాద్ ‘శశివదనే’ సినిమాపై హైప్ పెంచింది. ‘‘నా కెరీర్‌లో ‘శశివదనే’ సినిమా చాలా స్పెషల్. ‘హిట్-3’ తర్వాత నన్ను చాలామంది పోలీస్ పాత్రలే చూడాలా అని అన్నారు. అందుకే అది బ్రేక్ చేయడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. అది కాకుండా ఇందులో నటించిన వారందరికీ సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. అందరికీ బ్యాక్ స్టోరీలు ఉన్నాయి. మా మూవీలో ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. లవ్ స్టోరీ అయినప్పటికీ ట్విస్ట్ ఇస్తాము. అక్టోబర్ 10న మీ ముందుకు రాబోతుంది.

స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే లిప్ కిస్ పెట్టాను అన్నది ఈరోజుల్లో పెద్ద జోక్ అయిపోయింది. కానీ నేను ‘శశివదనే’ సినిమాలో హీరోకు ముద్దు పెట్టడానికి కారణం ఓ స్టోరీ ఉంటుంది. ముందు వద్దు అని అనుకున్నాము. ఎవరికీ ఇబ్బంది కలగకూడదని.. అనుకున్నారు. కానీ ఆ సీన్ ఇచ్చిన ఇంపాక్ట్ ఎందులోనూ లేదు. లవ్ స్టోరీ, కమర్షియల్ చిత్రాల్లో ఉండదు. ‘శశివదనే’ ముద్దు సీన్ చాలా అర్థవంతంగా పెట్టారు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story