అలా చెప్పడంలో ఓ గర్వం ఉంటుంది.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

మలయాళ నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) అందరికీ సుపరిచితమే. ఇటీవల ‘ఎంపురాన్-2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

అలా చెప్పడంలో ఓ గర్వం ఉంటుంది.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: మలయాళ నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) అందరికీ సుపరిచితమే. ఇటీవల ‘ఎంపురాన్-2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సర్‌జమీన్’(Sir Zameen) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్, స్టార్ హీరో తనయుడు సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్(Ibrahim Ali Khan) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా జులై 25 నుంచి నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘‘నేను నా దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. భారతీయుడిగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా మన దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను కేరళ నుంచి వచ్చినా.. మలయాళం మాట్లాడతానా.. లేదంటే మహారాష్ట్రకు చెందిన వాడినా హిందీ మాట్లాడానా కాకుండా మనమందరం భారతీయులం అని గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగితే.. నేను మా ఊరి పేరు కాకుండా భారత్ నుంచి వచ్చానని చెబుతాను. అలా చెప్పడంలో ఓ గర్వం ఉంటుంది. అదే మన దేశంపై మనకున్న నిజమైన ప్రేమకు గుర్తు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story