ప్రభాస్‌లోనూ ఒక రాముడు ఉన్నాడు.. చినజీయర్ స్వామి కామెంట్

by Disha Web Desk 10 |
ప్రభాస్‌లోనూ ఒక రాముడు ఉన్నాడు.. చినజీయర్ స్వామి కామెంట్
X

దిశ, సినిమా: ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం (జూన్ 6) తిరుపతిలో కనుల పండువగా జరిగింది. ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ సహా టీం మొత్తం హాజరుకాగా, చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. ‘శ్రీ రాముడు మానవజాతికి ఆదర్శ పురుషుడు. ఆయనను మనుషులు ప్రేమించారు. పశు పక్షాదులు ప్రేమించాయి. రుషులు, రాక్షసులు కూడా ప్రేమించారు. చివరకు ముక్కూ చెవులు కోసిన శూర్పణఖ కూడా ప్రేమించింది. అలాంటి రాముని చరిత్ర ఈ తరానికి అందించబోతున్న ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్‌లకు అభినందనలు. ప్రభాస్ తనలోని రాముడిని తెరపైకి తెస్తున్నాడు. ఈ చిత్రాన్ని మీరంతా చూసి ఆదరించాలి. లోకం మొత్తం వ్యాపించేలా చేయాలి’ అంటూ చెప్పుకొచ్చారు చినజీయర్ స్వామి.

Next Story

Most Viewed